Khammam: టీడీపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి!
Khammam: ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Khammam: టీడీపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి!
Khammam: తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యాలయంలో సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం అడహక్ కమిటీ సభ్యులు కేతినేని హరీష్ మాట్లాడుతూ ప్రజలకు విద్యను అందించడానికి పాఠశాలలకు పునాది వేసిన గొప్ప సంఘసేవకుడిగా ప్రసిద్ధి చెందాడు అని ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడని అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడని భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి ఉపాధ్యాయులు అని వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మీగడ రామారావు, కన్నెటీ పృథ్వీ, మల్లెంపాటి రాము, బానోత్ శ్రీను, నరసింహారావు, తదితరులు ఉన్నారు.




