Sathupalli: సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులు!

Sathupalli: సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధుల విడుదల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సింగరేణి సమస్యలపై సమీక్ష ఎమ్మెల్యే రాగమయి హర్షం.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 29 Sept 2026 7:53 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులు!

సత్తుపల్లి: సింగరేణి సంస్థ పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారంపై హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు, జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.*

ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో సింగరేణికి సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి అవసరాలపై సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి డా. మట్టా రాగమయి దయానంద్ గారు సమావేశంలో వివరించారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి చర్చించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం విడుదల చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశం కలగనుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు మాట్లాడుతూ, సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి డా. మట్టా రాగమయి దయానంద్ గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, జెన్‌కో, ట్రాన్స్‌కో, సింగరేణి సంస్థల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI