Khammam: ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి: ఖమ్మంలో అమరవీరుల స్తూపం వద్ద నిరసన

Khammam: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగ కళాకారులను ఆదుకుని, దసరా లోపు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఖమ్మంలో డిమాండ్ చేశారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 15 Sept 2026 6:19 PM IST
Khammam
X

Khammam: ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి: ఖమ్మంలో అమరవీరుల స్తూపం వద్ద నిరసన

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మయూరి సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ నిర్మాణంలో ప్రత్యేక పాత్ర పోషించిన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులను ప్రభుత్వం ఆదుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించి మిగతా కళాకారులకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ కళను ఆయుధంగా మార్చుకుని పాటను పోరాటంగా మలిచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులు నేడు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో తమ కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడ్డారని అన్నారు.

ఆత్మహత్యలకు పాల్పడుతూ గోచారమైన పరిస్థితిలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 12 సంవత్సరాలు దాటింది . తమ కలను శ్రమను సమన్వయం చేస్తూ తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ జీవితలలో మార్పు రాలేదని కావున నిరుద్యోగ కళాకారుల బాధలు అర్థం చేసుకొని ఈ దసరా లోపు రాష్ట్రంలో ఉన్న 1000 మంది నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాత కోటి నరసింహారావు, కాలంగి లలిత, బొడ్డు నాగేశ్వరరావు, నారాటి చంద్రమోహన్, ఎస్.కె పక్రుద్దీన్, అద్దంకి నరసింహారావు, పెద్దపాక విజయ్, కర్ష పుల్లయ్య, తిప్పారపు నాగేంద్రబాబు, పేరాల నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.