Julurupadu: తహశీల్దార్ ఆఫీస్ ముట్టడి.. ‘యూరియా యాప్’ రద్దుకు డిమాండ్

Julurupadu: రైతులకు ఇబ్బందికరంగా మారిన 'యూరియా యాప్'ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో భారీ ధర్నా నిర్వహించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 22 Jun 2026 3:57 PM IST
Julurupadu
X

Julurupadu: తహశీల్దార్ ఆఫీస్ ముట్టడి.. ‘యూరియా యాప్’ రద్దుకు డిమాండ్

Julurupadu: జూలూరుపాడు.. రైతులకు ఇబ్బంది కరంగా ఉన్న యూరియా యాప్ ను తక్షణమే రద్దుచేసి, పాత పద్ధతిలో రైతులకు యూరియా అందచేయాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..

ప్రస్తుతం సాగు ప్రారంభమైన తరుణంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి వల్ల సాగువేయం భారమై రైతంగం తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయారని పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతాంగం దిక్కుతోచలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన ఎరువుల ధరలను డీజిల్ మరియు పెట్రోల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలి,

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ముఖ్యంగా రెండు లక్షల రూపాయలు పైగా ఉన్న పంట రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేసి రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి మార్కెట్లో నకిలీ విత్తనాలు నాణ్యతలేని నకిలీ పురుగు మందులు అమ్ముతూ అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్న వ్యాపారులపై పిడి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో సీపీఐ , రైతు సంఘం నాయకులు యాలంకీ మధు, ఎస్.కె నాగుల్ మీరా, సిరిపురపు వెంకటేశ్వర్లు తూము కోటయ్య పొనేకంటి వెంకటేశ్వర్లు ఊ డల సుధా చెరుకుమల్ల రాజేశ్వరరావు, ఎస్.కె చాంద్ పాషా చీమకుర్తి సంతోష్ పసుపులేటి పవన్ చీమకుర్తి భాస్కర్ వెంకటేశ్వర్లు సురేష్ గోపి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story