Kothagudem: ఐటీసీ ఫ్యాక్టరీలో టెన్షన్ న్యాయం చేయాలంటూ బంధువుల డిమాండ్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ (ITC) పేపర్ బోర్డ్ కర్మాగారంలో విధుల్లో ఉన్న ఓ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు.
Kothagudem: ఐటీసీ ఫ్యాక్టరీలో టెన్షన్ న్యాయం చేయాలంటూ బంధువుల డిమాండ్!
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో పనిచేస్తున్న ఓ కార్మికుడు విధుల్లో ఉండగా గుండెపోటుకు గురై మృతి.
కార్మికుడి మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఐటీసీ ప్రధాన గేట్ ముందు ఉంచి ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, యాజమాన్యం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఘటనతో ఐటీసీ గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story




