Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: PDSU నేతల నిరసన, అరెస్టులు

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద PDSU ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 20 Aug 2026 4:27 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: PDSU నేతల నిరసన, అరెస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. పాలిటెక్నిక్ విద్యను కాపాడాలంటూ PDSU విద్యార్థి సంఘం నేతలు కలెక్టర్ కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ గోడలపై నినాదాలు రాసేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు.

“పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి” అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మహబూబాబాద్ సీఐ రఘుపతిరెడ్డిని సస్పెండ్ చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story