Kothagudem: ఐటీసీలో ఉద్రిక్తత.. వేతన ఒప్పందంపై రగిలిన వివాదం!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీ యూనిట్ వద్ద 14వ వేతన ఒప్పందానికి వ్యతిరేకంగా ఐఎన్టీయూసీ నాయకులు నిరసన చేపట్టారు.
Kothagudem: ఐటీసీలో ఉద్రిక్తత.. వేతన ఒప్పందంపై రగిలిన వివాదం!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ యూనిట్ వద్ద 14వ వేతన ఒప్పందంపై వివాదం ముదిరింది.
కాంట్రాక్ట్, బదిలీ, పర్మినెంట్ కార్మికులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఐఎన్టియుసి యూనియన్ నాయకులు ఐటీసీ ప్రధాన గేటు ఎదుట నిరసనకు దిగారు. వేతన సవరణలో వివక్ష చూపించారని, కార్మికుల హక్కులను విస్మరించారని తీవ్ర విమర్శలు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన బూర్గంపాడు పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో అక్కడ పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారు.
కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు మరింత తీవ్రం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Next Story




