Kothagudem: పాల్వంచలో తెలంగాణ గిరిజన సమాఖ్య మూడవ రాష్ట్ర మహాసభలు!

Kothagudem: గిరిజనుల హక్కులు, సమస్యల సాధనే ధ్యేయంగా జరగనున్న ఈ మహాసభల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 15 July 2026 10:29 PM IST
Kothagudem
X

Kothagudem: పాల్వంచలో తెలంగాణ గిరిజన సమాఖ్య మూడవ రాష్ట్ర మహాసభలు!

కొత్తగూడెం: గిరిజన హక్కుల రక్షణ కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాజీలేని పోరాటాలు నిర్వహించాల్సి ఉంటుందని తెలంగాణ గిరిజన సమాఖ్య (టిజిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ అన్నారు. బుధవారం జూలూరుపాడు మండల కేంద్రము లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు అనంతరం మూడవ రాష్ట్ర మహా సబల కరపత్రాన్ని విడుదల చేశారు అనంతరం భూక్యా శ్రీనివాస్ మాట్లాడుతు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలో ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గిరిజన సమాఖ్య మూడవ రాష్ట్ర మహాసభల ప్రచార కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, సవాళ్లు మరియు వారు సాగిస్తున్న పోరాటాలు తదితర కీలక అంశాలపై ఈ మహాసభల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. గిరిజన సమాజం అంతా ఏకమై ఈ రాష్ట్ర మహాసభల ఏర్పాట్లను వేగవంతం చేయాలని, మహాసభలను విజయవంతం చేయడానికి శ్రేణులంతా కదలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సమైక్య జిల్లా నాయకులు జర్పుల ఉపేందర్ , సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, హలవత్ భద్రు , వెంకటేశ్వర్లు, భూక్యా నరేష్, బాదవత్ సురేష్ తదితర గిరిజన నాయకులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story