Bhadrachalam: భద్రాచలం నుంచి ద్వారకా తిరుమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!
Bhadrachalam: భద్రాచలం నుంచి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి వెళ్లే భక్తుల కోసం TGSRTC భద్రాచలం డిపో నుంచి రెండు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపారు.
Bhadrachalam: భద్రాచలం నుంచి ద్వారకా తిరుమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!
Bhadrachalam: ఆగస్టు 25- భద్రాచలం పరిసర ప్రాంతాలనుండి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనువారికి TGSRTC భద్రాచలం డిపో నుండి రెండు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ జంగయ్య మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
మొదటి బస్సు ఉదయం 5.00 గంటలకు భద్రాచలం నుండి బయలుదేరి 10.00 గంటలకు ద్వారకాతిరుమల చేరుకుంటుందని,తిరిగి ద్వారకా తిరుమల నుండి మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.00 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని ఆయన అన్నారు. అలాగే రెండవ బస్సు ఉదయం 6.45 గంటలకు భద్రాచలం నుండి బయలుదేరి 11.45 గంటలకు ద్వారకా తిరుమల చేరుకుంటుందని, తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని ఆయన అన్నారు.
ఈ యొక్క బస్సు వయ పాల్వంచ, జగన్నాధపురం, దమ్మపేట, చింతలపూడి ద్వారా ద్వారకా తిరుమల వెళ్తుందని, ఈ బస్సులకు చార్జీలు పెద్దలకు రూ.170/-లు గా పిల్లలకు రూ 90/-ల వరకు ఉంటుందని ఆయన అన్నారు.ద్వారకా తిరుమలకు వెళ్లే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు




