Chintoor: పోలవరం జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కె. చక్రవర్తి ఎదుట ముగ్గురు మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు మంగళవారం లొంగిపోయారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 27 Oct 2026 6:18 PM IST
Chintoor
X

Chintoor: పోలవరం జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు!

Chintoor: పోలవరం జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి ఎదుట ముగ్గురు మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యులు మంగళవారం లొంగుబాటు అయ్యారు.చింతూరు డి.ఎస్.పి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ చక్రవర్తి వివరాలు వెల్లడించారు.లొంగిపోయిన మావోయిస్టులలోమాడవి కోయింగ్ @ రజని, హేమల హెడ్మా @ దీపక్, కొవ్వాసి జోగి @ గంగి లు ఉన్నారు.

ఈ ముగ్గురు మావోయిస్టులు పలు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్లు తెలిపారు.లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులు 2013, 2014, 2017 సంవత్సరాల్లో జరిగిన మఠం ఫారెస్ట్, సబ్‌ప్లాట్, వంగమెల్లి ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్లు వెల్లడించారు.వీరు కళాజాతరల నిర్వహణతో పాటు తుపాకీ తూటాల అసెంబ్లింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.

మావోయిస్టు సిద్ధాంతాలు,ఆచరణలోని వ్యత్యాసాలు,కుల వివక్ష, కొన్ని వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాల పై విసుగు చెందడంతో పాటు ప్రజల్లో ఆదరణ తగ్గడం,పోలీసుల గస్తీ పెరగడం వల్ల ప్రాణహాని ఉంటుందనే భయంతో వీరు లొంగిపోయినట్లు తెలిపారు.మావోయిస్టులు హింసాత్మక మార్గాలను విడిచిపెట్టి స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అందే అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని ఎస్పీ చక్రవర్తి తెలిపారు.ఈ కార్యక్రమంలో చింతూరు ఓఎస్‌డీ (అడ్మిన్) మంద జావలి ఆల్ఫోన్స, చింతూరు డీఎస్పీ కె. ఉదయ పావని, సీఐ గోపాలకృష్ణ, ఎస్సై సంతోష్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR