Kothagudem: భద్రాద్రి జిల్లాకు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాల హెచ్చరిక!
Kothagudem: రానున్న 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు. హెచ్చరించిన టీజీఐసీసీసీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
Kothagudem: భద్రాద్రి జిల్లాకు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాల హెచ్చరిక!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రానున్న 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) హెచ్చరించింది.
ఈ సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు–మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు.




