Kothagudem: పోలీసుల మెరుపు తనిఖీలు నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కేసులు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్ల వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 15 July 2026 5:32 PM IST
Kothagudem
X

Kothagudem: పోలీసుల మెరుపు తనిఖీలు నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కేసులు!

కొత్తగూడెం:​ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ఈ రోజు ఉదయం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగింది.ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన మొత్తం 36 వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేసి, రూ. 7,510/- జరిమానా విధించి వసూలు చేశారు.

​ఈ సందర్భంగా కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, వాహన యజమానులు అందరూ తమ వాహనాలకు నిబంధనలకు అనుగుణంగా స్పష్టంగా కనిపించే నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నంబర్ ప్లేట్లను వక్రీకరించడం, అంకెలను మార్చడం లేదా స్పష్టంగా కనిపించకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేవిధంగా వాహన యజమానులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను సక్రమంగా ఉంచుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. పట్టణంలో రోడ్డు భద్రతను పటిష్టం చేయడానికి ఇటువంటి డ్రైవ్ లు నిరంతరం చేపడుతామని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story