Bhadradri Kothagudem: మణుగూరులో ఘోరం: స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థి బలి!

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విద్యార్థి నక్క హర్షవర్ధన్ మృతి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, విద్యార్థి సంఘాల ఆందోళన.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 20 April 2026 1:31 PM IST
Bhadradri Kothagudem
X

Bhadradri Kothagudem: మణుగూరులో ఘోరం: స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థి బలి!

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణంలోని గుట్టమల్లారం గ్రామంలో శ్రీ విజ్ఞాన్ స్కూల్ నిర్వాకుల నిర్లక్ష్యం కారణంగానే 9 వ తరగతి చదువుతున్న విద్యార్థి నక్క హర్షవర్ధన్ (14) మృతి చెందాడని , మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించవలసిన స్కూలు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిస్తున్నారని. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియకుండానే స్కూల్ యాజమాన్యం మధ్యాహ్నం ఒంటిగంటకు విడిచిపెట్టడంతో విద్యార్థులు స్కూల్ వ్యాన్ లో తాము దిగవలసిన ప్రాంతంలో దిగకుండా వేరే ప్రాంతంలో వ్యాన్ దిగి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రేగులగండి చెరువులో స్నానానికి వెళ్లడానికి కారణం ఎవరని విద్యార్థి సంఘాల నాయకులు , మృతిని బంధువులు ప్రశ్నిస్తున్నారు.

1/70 యాక్ట్ అమల్లో ఉన్న ఆదివాసీ ప్రాంతమైన ఏజెన్సీ గ్రామాల్లో అరకురా అనుమతులతో స్కూల్స్ నిర్వహిస్తూన్న విద్యా సంస్థలకు, ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల క్రమశిక్షణ , రక్షణ పై లేదని , నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను నివారించాలని , విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి సరైన అనుమతులు లేక అరకొరగా అనుమతులు పొంది పాఠశాలలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు .

9వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి కారణమైన శ్రీ విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA

Next Story