Kothagudem: అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా అందని దివ్యాంగుల పెన్షన్!

Kothagudem: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా దివ్యాంగురాలు కారం రేవతికి పెన్షన్ అందడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 12 Nov 2026 10:52 AM IST
Kothagudem
X

Kothagudem: అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నా అందని దివ్యాంగుల పెన్షన్!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో దివ్యాంగురాలికి ప్రభుత్వ పెన్షన్ అందకపోవడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన కారం నాగేశ్వరరావు కుమార్తె కారం రేవతి (23) మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతోంది. వికలాంగులకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు కాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

గతంలో కుటుంబానికి ట్రాక్టర్ ఉండేదని, ప్రస్తుతం అది లేకపోయినా ఆన్‌లైన్‌లో ట్రాక్టర్ ఉన్నట్లు చూపిస్తుండటంతో పెన్షన్ నిలిపివేశారని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి అర్హురాలైన రేవతికి దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA