Kothagudem: ఆగస్టు 31న పాంచజన్య సంకల్ప సభ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు వీరన్న!

Kothagudem: ఆగస్టు 31న నిజామాబాద్‌లో కవిత నేతృత్వంలో పాంచజన్య సంకల్ప సభ. సామాజిక తెలంగాణే తమ లక్ష్యమని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు వీరన్న వెల్లడి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 22 Aug 2026 12:48 PM IST
Kothagudem
X

Kothagudem: ఆగస్టు 31న పాంచజన్య సంకల్ప సభ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు వీరన్న!

Kothagudem: తెలంగాణ సాధన నుంచి సామాజిక న్యాయం దిశగా మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) జిల్లా అధ్యక్షుడు వీరన్న తెలిపారు. శనివారం కొత్తగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 31న నిజామాబాద్‌లోని కలెక్టరేట్ గ్రౌండ్‌లో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన సూత్రాల అమలే పాంచజన్య సంకల్ప సభ ప్రధాన లక్ష్యమని వీరన్న పేర్కొన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ సామాజిక తెలంగాణ సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు.

వ్యవసాయమే రాష్ట్రానికి వెన్నెముక అని పేర్కొన్న వీరన్న, పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ఎరువులు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంటలకు భద్రత కల్పించి రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

తెలంగాణాలో రక్షణసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు

భూమి ఉండాలని ‘భూలక్ష్మి’ పేరుతో ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి అందించనున్నట్లు తెలిపారు.

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, సబ్బండ వర్గాలకు రాజ్యాధికారంలో సముచిత భాగస్వామ్యం కల్పించాలని కోరారు.

సామాజిక న్యాయ తెలంగాణ కోసం ..

పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వేలాది మందిని నిజామాబాద్‌కు తరలించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వీరన్న తెలిపారు. సామాజిక తెలంగాణ సాధనే తెలంగాణ రక్షణ సేన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వాసం రామకృష్ణ, వాంకుడోత్ రవి, లకావత్ సురేష్,కొర్సా గణేష్, బండారి పృథ్వి రాజ్, ముసల రామకృష్ణ, మహమ్మద్ ఖలీల్, పవన్,బాబురావు సాయి తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story