Aswaraopeta: తెగిన అంకమ్మచెరువు గండిని పరిశీలించిన మంత్రి తుమ్మల!

Aswaraopeta: తుఫాన్ ప్రభావంతో తెగిన అశ్వారావుపేట అంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించి మరమ్మతులకు ఆదేశించారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 6 Nov 2026 8:32 AM IST
Aswaraopeta
X

Aswaraopeta: తెగిన అంకమ్మచెరువు గండిని పరిశీలించిన మంత్రి తుమ్మల!

Aswaraopeta: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న అశ్వారావుపేట మండలంలోని అంకమ్మ చెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఆయన వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఉన్నారు.

తుఫాన్ ధాటికి చెరువు కట్ట తెగిపోవడంతో పరిసర పంట పొలాలు నీట మునిగాయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంత్రి స్వయంగా తెగిన కట్ట వద్దకు వెళ్లి నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న అన్ని చెరువులు, కుంటలు, రోడ్లకు వెంటనే ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలని ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రైతులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మంత్రి వెంట జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వున్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA