Sathupalli: సత్తుపల్లిలో తుమ్మల 40 వసంతాల వేడుకలు ఘనంగా

Sathupalli: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సత్తుపల్లిలో అభిమాన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 8 May 2026 3:28 PM IST
Sathupalli
X

Sathupalli

Sathupalli: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమాన వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్ విజయ్ కుమార్ ఆధ్వర్యం వహించగా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో తమ నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వివరించారు.

కార్యక్రమంలో మంత్రి తుమ్మల చేపట్టిన అభివృద్ధి పనులపై రూపొందించిన ఏఐ ప్రదర్శనను కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా వీక్షించారు. డాక్టర్ తుమ్మల యుగంధర్ భావోద్వేగంగా మాట్లాడుతూ, సత్తుపల్లి ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల ఎక్కడ ఉన్నా సత్తుపల్లి అభివృద్ధిపైనే దృష్టి ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు దోమ ఆనంద్, మున్సిపల్ చైర్‌పర్సన్ రెహనా, బొంతు సుమలత, సొసైటీ అధ్యక్షుడు చల్లగొల్ల కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గాద చెన్నకేశవరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story