Khammam: టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలోస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Khammam: ప్రెస్ క్లబ్‌లో 80వస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్.
Khammam: టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!
Khammam: ఖమ్మం ప్రెస్ క్లబ్లో శనివారం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు అధ్యక్షతన టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జర్నలిస్టులకు స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూఎందరో మహనీయుల త్యాగఫలంగా భారతదేశంలో నేటి సమాజం స్వేచ్ఛగా, సమానత్వంతో జీవిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ లౌకిక భావిభారతానికి జర్నలిస్టులు మార్గదర్శకంగా నిలవాలని అన్నారు. జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా టిడబ్ల్యూజేఎఫ్ పాటుపడుతుందని అన్నారు.
కానీ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. దేశంలో స్వేచ్ఛ హరింపు తీవ్రతరం కావడంతో జెన్.జీ ఉద్యమాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ స్ఫూర్తితో పత్రికా స్వేచ్ఛ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ధ్రువ సాగర్, టిబిజేఏ జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీఎస్ చక్రవర్తి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు మారెడ్డి నాగేందర్ రెడ్డి, నలుబోలా మధుశ్రీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దగ్గుపాటి మాధవరావు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి మేకపోతుల ఉప్పలయ్య, నగర కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు వీసారపు అంజయ్య, అర్షద్, యూసుఫ్, కొమిరే నాగేశ్వరరావు, శరత్, పవన్ కుమార్, షకీల్, వీరారెడ్డి, కిరణ్, గోపి, తిరుపతిరావు, భవాని, బ్రహ్మం, నాగార్జున, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.




