Khammam: పెండింగ్ సమస్యలపై ప్రభుత్వంపై జర్నలిస్టుల నినాదాల హోరు!

Khammam: కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 13 July 2026 11:15 PM IST
v
X

Khammam: పెండింగ్ సమస్యలపై ప్రభుత్వంపై జర్నలిస్టుల నినాదాల హోరు!

ఖమ్మం: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు అందించాలని, ఆర్టీసీ బస్సు పాసులతో పాటు మెట్రో పాసులను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొద్ది మందికే అక్రిడిటేషన్లు ఇవ్వడం సరికాదన్నారు.

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story