Khammam: ఖమ్మం బర్మా షెల్ రోడ్డులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!
Khammam: త్రీ టౌన్ బర్మా షెల్ రోడ్డులో గుర్తుతెలియని 60 ఏళ్ల పురుషుడి మృతదేహం లభ్యం. కేసు నమోదు చేసి వివరాల కోసం సంప్రదించాలని ఇన్స్పెక్టర్ మోహన్ బాబు విజ్ఞప్తి.
Khammam: ఖమ్మం బర్మా షెల్ రోడ్డులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!
Khammam: ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఒక గుర్తుతెలియని పురుషుడు మృతదేహం లభ్యమైందని ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మెహన్ బాబు తెలిపారు. ఆదివారం సమాచారం అందుకున్న పోలీసులు నగరంలోని బర్మా షెల్ రోడ్ లో గల సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు 60 సంవత్సరాల వయస్సు గల మృతుడు నీలం రంగు షర్టు, లుంగీ ధరించిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నందు భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన, గుర్తించగలిగిన వారు ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన పోన్ నెంబర్లు .ఖమ్మం 3 టౌన్ పిఎస్ నెంబర్ :- 8712659116
ఇన్స్ పెక్టర్ ఖమ్మం 3 టౌన్ నెంబర్ :-8712659115
పి ఆర్ వో




