Kothagudem: కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిప్పులు!
Kothagudem: సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ కేటాయింపుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు.
Kothagudem: కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిప్పులు!
కొత్తగూడెం: తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2 ను సింగరేణికి కేటాయించినందుకు ప్రధాన మంత్రి మోడీకి ధన్యవాదాలు.. కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి కిషన్ రెడ్డికి సన్మానం.సింగరేణి ప్రధాన కార్యాలయం కోల్డ్ టౌన్,కొత్తగూడెంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్ర సభ. కాషాయమయమైన కొత్తగూడెం.విశిష్ట అతిథిగా పాల్గొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్ రెడ్డి.
తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యన్ రాం చందర్ రావు.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, శాసనసభ బిజెపి ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ.బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు.సింగరేణి నష్టాల్లోకి నెట్టింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు.
రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తుంటే,రోము నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫీడెల్ ఫిడేలు వాయించిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు.సింగరేణి కార్మికులు చెమటోడుస్తూ సింగరేణిని ముందుకు తీసుకువెళ్లాలనుకుంటుటే.సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి డబ్బుతో ఫుట్బాల్ ఆడుతున్నాడని విమర్శించారు.లక్ష కోట్ల ఆదాయం ఇచ్చే తాడిచర్ల బొగ్గు బ్లాక్ ను ఎటువంటి ఆక్షన్, నామినేషన్ల లేకుండా కేంద్రం సింగరేణికి కేటాయించిందన్నారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల భారీ కోల్ స్కామ్ చేసిందని తీవ్రంగా విమర్శించారు.రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతుల విషయంలో, ప్రజలకు తాగునీటి విషయంలో పూర్తిస్థాయి వైఫల్యం చెందారని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలు మోపుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో దొడ్డి దారిన మైన్స్ ను ఎలాట్ చేస్తే వాటిని సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు.అన్ని కంపెనీలకు బొగ్గు బ్లాక్ లను ఆక్షన్ ద్వారా ఇవ్వాలని 2014లో కేంద్రం చట్టం చేసిందని వివరించారు.సింగరేణికి పరిరక్షణకు. కార్మికులకు అండగా ఉండాలని మోడీ ప్రభుత్వం తాడిచర్ల 2 బ్లాకును సింగరేణికి కేటాయించిందన్నారు.
సింగరేణి ఈపరిస్థితి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు.సింగరేణికి కొత్త బ్లాకులు దొరకలేదని,దీనికి కారణం కేసీఆర్ అహంకార పూరిత చర్య అని విమర్శించారు.సింగరేణిని అడ్డం పెట్టుకొని, ఆనాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ తమ పార్టీల ప్రయోజనాల కోసం,ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.కేసీఆర్ ఒరిస్సా వెళ్ళి. నవీన్ పట్నాయక్ తో రాజకీయాలు మాట్లాడాడు తప్ప నైని బొగ్గు బ్లాకు పర్మిషన్ అడగలేదని విమర్శించారు.
ఒరిస్సాలోని నైని కోల్ బ్లాకు ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సింగరేణి కేటాయించిందని,పూర్తిస్థాయిలో పైని బొగ్గు బ్లాకులో ఉత్పత్తి జరిగితే సింగరేణికి మంచి ఆదాయం వస్తుందన్నారు.కేటీఆర్ ,హరీష్ రావు కోల్ మాయమైందని నాకు ఉత్తరాలు రాస్తున్నారని,సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 51% వాటా ఉందన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడైనా బాధ్యులను చేశారా అని ప్రశ్నించారు.
అప్పుడు బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్నే నేడు కాంగ్రెస్ కూడా అవలంబిస్తుందని. విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం సింగరేణి పై ప్రేమ ఉన్నా,54 వేల కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణకు కార్మికులకు భరోసా భద్రత కల్పించాలని,టెండర్ లేకుండా తాడిచెర్ల బొగ్గు బ్లాకు ను సింగరేణికి కేటాయించినట్లు తెలిపారు.
గ్రేడ్ 8 నాణ్యమైన బొగ్గు లభిస్తుందని ఈ బ్లాక్ తో వేలాదిమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు.నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను ఆదుకునేందుకు ఆనాటి ప్రధాని వాజ్పేయి సింగరేణి సంస్థకు 600 కోట్లు ఇస్తే నేటి ప్రధాని మోడీ బొగ్గు బ్లాక్ ను కేటాయించి సింగరేణిని మరోసారి ఆదుకున్నట్లు వివరించారు.తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం బిజెపి చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు.
సింగరేణి సంస్థలు రాజకీయ జోక్యం విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్నారు.. సింగరేణి భవిష్యత్తు కోసం టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆలోచన చేయలేదనిలో సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్న ఫలితంగానే ప్రైవేట్ కంపెనీలు పోటీపడి బొగ్గు బ్లాక్ లను దక్కించుకున్నాయని తెలిపారు.సింగరేణి సంస్థ నిధులను నిధులను ఒకరేమో సిద్దిపేట గజ్వేల్ కు తరలించకొనిపోతే, సీఎం రేవంత్ రెడ్డి మెస్సి తో ఫుట్బాల్ ఆడటానికి సింగరేణి నిధులను ఉపయోగించుకుంటారని తీవ్రంగా విమర్శించారు.
సింగరేణి కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన కష్టాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు వృధా చేస్తున్నాయన్నారు.పదేళ్ల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తించలేదని ఇప్పుడేమో సంస్థలు అవినీతి జరుగుతుందని బొగ్గు మాయమైందని కేటీఆర్ హరీష్ రావు తనకు లేఖలు రాస్తున్నారని విమర్శించారు.
సింగరేణి సంస్థకు గత బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు 54 వేల కోట్ల రూపాయలు పడ్డాయని వాటిని చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాల్ ఇండియాకు పైసా బకాయి లేకుండా చెల్లిస్తున్నట్లు తెలిపారు.భవిష్యత్తులో సింగరేణికి కేంద్రంలోని మోడీ బిజెపి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ,తెలంగాణా బిజెపి శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గుప్త, రామారావు పటేల్, ఎమ్మెల్సీలు కొమరయ్య అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్, బిఎం ఎస్ జాతీయ కార్యదర్శి మాధవ్ నాయక్ , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.




