Bhadrachalam: భద్రాచలం శాంతినగర్‌లో ప్రభుత్వ భూమి కబ్జాపై ఐక్య వేదిక ఫిర్యాదు!

Bhadrachalam: భద్రాచలం శాంతినగర్ సర్వే నెం. 111/5/1లోని 1.03 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడాలని శుక్రవారం ఐక్య వేదిక తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చింది.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 20 Nov 2026 5:23 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం శాంతినగర్‌లో ప్రభుత్వ భూమి కబ్జాపై ఐక్య వేదిక ఫిర్యాదు!

భద్రాచలం: స్థానిక శాంతినగర్ కాలనీ, భద్రాచలం రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 111/5/1లో గల [1ఎకరాలు/03 గంటల ] విస్తీర్ణం కలిగిన విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా తక్షణమే కాపాడి, రక్షణ కల్పించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం స్థానిక భద్రాచలం తహశీల్దార్ గారికి ఐక్య వేదిక తరుపున వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు సామాజిక ఉద్యమకారులు అలవాల రాజా మాదిగ మాట్లాడుతూ.. భద్రాచల పట్టణంలో శాంతినగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమిని పేద ప్రజల సంక్షేమానికి, భవిష్యత్ ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన ఈ సర్వే నెంబర్ 111/5/1 గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొందరు అక్రమార్కులు సర్వేనెంబర్ బోర్డు తొలగించి, చెరువును పూడ్చి, ముళ్ళ పొదలను తొలగించి, పట్టితో పూడ్చి చదును చేస్తూ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

తహశీల్దార్ గారు తక్షణమే స్పందించి సదరు భూమికి సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని, చుట్టూ కంచె (ఫెన్సింగ్) ఏర్పాటు చేసి 'ప్రభుత్వ భూమి' అని తెలిపే హెచ్చరిక బోర్డులను పెట్టాలని కోరారు. ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఇల్లు ఇంటి స్థలం లేని పేద ప్రజల తరపున పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem