Sathupalli: సత్తుపల్లి 15వ బెటాలియన్‌లో వాల్మీకి జయంతి వేడుకలు

Sathupalli: సత్తుపల్లి మండలం బి. గంగారంలోని 15వ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ ఎన్. పెద్దబాబు ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 26 Oct 2026 6:37 PM IST
Sathupalli
X

Sathupalli: సత్తుపల్లి 15వ బెటాలియన్‌లో వాల్మీకి జయంతి వేడుకలు

సత్తుపల్లి: 15వ ప్రత్యేక పోలీసు పటాలము, బి. గంగారం నందు సోమవారం వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెటాలియన్ కమాండెంట్ శ్రీ ఎన్. పెద్దబాబు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కమాండెంట్ ఎన్. పెద్దబాబు మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి ఆదికవిగా ప్రసిద్ధి చెందారని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సాహిత్యానికి ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని పేర్కొన్నారు.

వాల్మీకి మహర్షి జీవితం, ఆయన రచనలు, ఆదర్శాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఇలాంటి మహనీయుల జయంతి వేడుకలను నిర్వహించడం ద్వారా వారి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయడంతో పాటు, వారి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ఆచరించేలా ప్రోత్సహించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ శ్రీ ఏ. అంజయ్య గారు, అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ బి. వినాయకరావు గారు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, హోంగార్డులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI