Velugumatla: వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలన!

Velugumatla: వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య. పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 13 Oct 2026 5:12 PM IST
Velugumatla
X

Velugumatla: వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలన!

Velugumatla: వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఈరోజు సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారుల వారీగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునాది స్థాయిలో ఉన్న ఇళ్లు, గోడల నిర్మాణం జరుగుతున్న ఇళ్లు, ఇతర దశల్లో ఉన్న నిర్మాణాల వివరాలను సమీక్షించారు. ఇంకా పనులు ప్రారంభించని ఇళ్లకు సంబంధించిన కారణాలను గుర్తించి, లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జాప్యానికి కారణాలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సూచనలు, ప్రభుత్వ మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. నిర్మాణ పనుల సమయంలో లబ్ధిదారులు ఎదుర్కొనే సమస్యలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, పనులు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలన్నారు.

అలాగే, ప్రతి ఇంటి నిర్మాణ పురోగతిని క్రమం తప్పకుండా నమోదు చేయాలని, పనులు ప్రారంభం కాని ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు సకాలంలో అందేలా కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.