Khammam: ఖమ్మంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం!
Khammam: ఖమ్మం రైల్వే స్టేషన్‌కు విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కమ్మ మహాజన సంఘం ఘన స్వాగతం పలికింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Khammam: ఖమ్మంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం!
ఖమ్మం: ఖమ్మం రైల్వే స్టేషన్‌కు విచ్చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గారికి కమ్మ మహాజన సంఘం నాయకులు, సభ్యులు ఘన స్వాగతం పలికారు. కోదాడలో నిర్వహించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక, సేవా కార్యక్రమాలను వెంకయ్య నాయుడు గారికి వివరించారు. సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించిన వెంకయ్య నాయుడు గారు సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కొల్లు రఘు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చావా రాము, ఉపాధ్యక్షురాలు కర్నాటి రమాదేవి, సహాయ కార్యదర్శి వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మలకుమారి, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, నల్లమల ఆనంద్, మేదరమెట్ల స్వరూపరాణి, పోతినేని భూమేశ్వరరావు, కోలేటి నవీన్, నంబూరి ప్రసాద్, తాళ్లూరి మురళీకృష్ణ, బండి రవికుమార్, బతినేని ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.




