Kothagudem: ఇంజనీర్స్ డే వేళ 1566వ మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్

Kothagudem: ఇంజనీర్స్ డే సందర్భంగా కొత్తగూడెంలో వాక్ ఫర్ ట్రీస్ వ్యవస్థాపకుడు విశ్వామిత్ర చౌహాన్ సింగరేణి జీఎంతో కలిసి తన 1566వ మొక్కను నాటారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 15 Sept 2026 6:44 PM IST
Kothagudem
X

Kothagudem: ఇంజనీర్స్ డే వేళ 1566వ మొక్క నాటిన విశ్వామిత్ర చౌహాన్

కొత్తగూడెం: ఇంజనీర్స్ డే సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషిగా వాక్ ఫర్ ట్రీస్ వ్యవస్థాపకుడు, వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత విశ్వామిత్ర చౌహాన్ మొక్కలు నాటారు. ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న ఆయన తన 1566వ మొక్కను నాటి ఇంజనీర్లకు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కొత్తగూడెం కార్పొరేట్ విభాగం E&M సెంట్రల్ స్టోర్స్ జనరల్ మేనేజర్ కె. ప్రసాద్ రావుతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కె. ప్రసాద్ రావు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే పర్యావరణంపై ప్రేమ, సమాజ శ్రేయస్సుపై అవగాహన కలిగి ఉండటం అభినందనీయమన్నారు. సొంత ఖర్చులతో మొక్కలను కొనుగోలు చేసి నాటడంతో పాటు వృక్ష జాతుల మొక్కలను పెంచేందుకు విశ్వామిత్ర చౌహాన్ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు.

ప్రస్తుత తరంలో పిల్లలు మొబైల్ ఫోన్లకు ఆకర్షితులవుతున్న సమయంలో పచ్చదనం పెంపొందించేందుకు విశ్వామిత్ర చౌహాన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణలో ఆయన చూపుతున్న నిబద్ధతను కొనియాడారు.

పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య స్వయంగా విశ్వామిత్ర చౌహాన్‌ను మొక్కల పెంపకంలో తన వారసుడిగా ప్రకటించడం ఆయన పర్యావరణ సేవకు నిదర్శనమన్నారు. విశ్వామిత్ర చౌహాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గర్వకారణమని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లా ఆఫీసర్, అడ్వకేట్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM