Sathupally: సత్తుపల్లి విశ్వశాంతి విద్యాలయంలో ఘనంగా వినాయక చవితి!

Sathupally: సత్తుపల్లి విశ్వశాంతి విద్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు విద్యార్థులకు గణపతి ఆకారంలోని పరమార్థాన్ని వివరించిన ప్రిన్సిపల్ పసుపులేటి నాగేశ్వరరావు

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 13 Sept 2026 7:20 AM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లి విశ్వశాంతి విద్యాలయంలో ఘనంగా వినాయక చవితి!

Sathupally: ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో గణనాథుని ఆకారం విద్యార్థులకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన సందేశాలను అందిస్తుందని విశ్వశాంతి విద్యాలయం ప్రిన్సిపల్ పసుపులేటి నాగే శ్వరరావు అన్నారు.

వినాయక చవితిని పురస్కరించుకొని శనివారం విశ్వశాంతి విద్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలను ఒకచోట ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పసుపులేటి నాయేశ్వరరావు గణపతి చరిత్రను, గణనాథుని ఆకారంలోని ప్రతి అంశం విద్యార్థులకు అందించే స్ఫూర్తిదాయకమైన సందేశాలను వివరించారు.

గణపతి పెద్ద తల విశాలంగా ఆలోచించాలని, చిన్న కళ్ళు ఏకాగ్రతతో దృష్టి పెట్టాలని, పెద్ద చెవులు మంచి విషయాలను శ్రద్ధగా వినాలని, పెద్ద పొట్ట విజయాపజయాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తాయని తెలిపారు.

గణనాథునికి ప్రత్యేక పూజల అనంతరం చిన్నారులు ఉత్సాహంగా నృత్యాలు చేసి వేడుకలను సందడిగా మార్చారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి పాఠశాల యాజమాన్యo నరుకుల్ల సత్యనారాయణ, అవినాష్, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI