Bhadrachalam: పట్టభద్రులంతా ఓటు వేసి గెలిపించండి: జనసేన అభ్యర్థి గడల శ్రీనివాస్!
Bhadrachalam: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే భద్రాచలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిసేలా పాటుపడతానని జనసేన అభ్యర్థి గడల శ్రీనివాస్ అన్నారు.
Bhadrachalam: పట్టభద్రులంతా ఓటు వేసి గెలిపించండి: జనసేన అభ్యర్థి గడల శ్రీనివాస్!
భద్రాచలం: పట్టభద్రులంతా జనసేన పార్టీ నుంచి ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని హరిత హోటల్లో జనసేన నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడుతూ పట్టభద్రులంతా జనసేనకు ఓటు వేసి గెలిపించేలా కార్యాచరణ చేపట్టి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని అన్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన వ్యక్తిగా విద్యావంతుడినైన తనకు జిల్లాలోని పట్టభద్రులంతా తనకు అండగా నిలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రస్తుతం అన్ని సమస్యలు పట్ల తనకు పూర్తి అవగాహన కలిగి ఉన్నందున వాటి సాధనకు పెద్దపీట వేస్తానని అన్నారు.
భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్లో జనసేన అధికారంలో ఉన్నందున సరిహద్దు ప్రాంతాల్లోని సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. పట్టభద్రులంతా ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని దానిని ఉపయోగించుకొని అందరూ వారి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పట్టబద్రులకు సూచించారు.




