Aswaraopeta: అశ్వారావుపేటలో ఓటర్ల జాబితా సవరణ.. ఇంటింటికీ బీఎల్వోలు!

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం ప్రారంభమైంది.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 25 Jun 2026 9:38 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: అశ్వారావుపేటలో ఓటర్ల జాబితా సవరణ.. ఇంటింటికీ బీఎల్వోలు!

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR) ప్రారంభమైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఉట్లపల్లి గ్రామంలో జరుగుతున్న SIR కార్యక్రమాన్ని తహసీల్దార్ కిషోర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నారు.

కొత్తగా 18 ఏళ్లు పూర్తిచేసుకున్న అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్ల తొలగింపు, వివరాల్లోని తప్పుల సవరణను చేపట్టనున్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తారు.

ఓటర్లు BLOలు అందించే ఫారాలను పూర్తి చేసి సమర్పించాలని ఎన్నికల అధికారులు సూచించారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడం, ప్రతి అర్హ పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం లక్ష్యమని తహసీల్దార్ కిషోర్ తెలిపారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA

Next Story