Gurralacheruvu: ఆయిల్ పామ్ తోటల్లో పుట్టగొడుగుల సందడి!

Gurralacheruvu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్రాలచెరువులోని ఆయిల్ పామ్ తోటల్లో విరివిగా లభిస్తున్న సహజ పుట్టగొడుగులు. ఎంతో ఉత్సాహంగా ఏరుకుంటున్న స్థానిక రైతులు, గ్రామస్తులు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 16 Oct 2026 12:22 PM IST
Gurralacheruvu
X

Gurralacheruvu: ఆయిల్ పామ్ తోటల్లో పుట్టగొడుగుల సందడి!

Gurralacheruvu: అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువులో ఇటీవల కురిసిన వర్షాలకు ఆయిల్ ఫామ్ తోటల్లో పుట్టగొడుగులు (పుట్టకొక్కులు) విరివిగా మొలిచాయి. వీటిని మష్రూమ్స్ అంటారుకూడ

తడిసిన నేల, కుళ్లిన ఆయిల్ ఫామ్ ఆకులు, మట్టిలో ఉన్న సేంద్రీయ పదార్థం కలిసి ఈ పుట్టకొక్కులు గుంపులు గుంపులుగా వచ్చాయి. తోట కచేలు (కంప మధ్య) తెల్లగా మెరుస్తున్న ఈ సహజ మష్రూమ్స్ ను స్థానిక రైతులు, కూలీలు ఎంతో ఉత్సాహంగా ఏరుకుంటున్నారు. గుర్రాలచెరువు గ్రామానికి చెందిన రైతు సంకురాత్రి సతీష్ తోటలో మొలిచాయి.

ఒకప్పుడు అడవుల్లో, పొలం గట్లపై, కంచెలో వున్నా పుట్టమీద అధిక వర్షాలు కూరసినప్పుడు మాత్రమే కనిపించే ఈ పుట్టకొక్కులు ఇప్పుడు ఆయిల్ ఫామ్ తోటల్లో కూడా సమృద్ధిగా లభిస్తుండటం విశేషం. సహజంగా పెరిగే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రుచితో పాటు పోషకాలు ఎక్కువగా ఉండటంతో గ్రామస్తులు వీటిని ఇష్టంగా వండుకుంటారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA