Kothagudem: గణేష్ మండపం వద్ద విషాదం. డ్యాన్స్ చేస్తూ మహిళ కుప్పకూలుడు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం టేగులచెరువులో విషాదం. గణేష్ మండపం వద్ద వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.

G Ravi, Bhadradri
Published on: 22 Sept 2026 8:17 AM IST
Kothagudem
X

Kothagudem: గణేష్ మండపం వద్ద విషాదం. డ్యాన్స్ చేస్తూ మహిళ కుప్పకూలుడు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం టేగులచెరువు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశుని మండపం వద్ద నిర్వహిస్తున్న వేడుకల్లో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

గ్రామంలో గణేశ్ నవరాత్రి వేడుకల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుండగా, సదరు మహిళ భోజనం చేసి తిరిగి వస్తూ గణేశుని మండపం వద్ద జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొంది. ఈ క్రమంలో డ్యాన్స్ చేస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

దీంతో అక్కడున్న భక్తులు, స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri