Bayyaram: బయ్యారంలో మద్యం మహమ్మారిపై సమరం బెల్ట్ షాపులు మూసేయాలని చాటింపు!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బెల్ట్ షాపులు, సారాయి బంద్ చేయాలని డప్పు చాటింపుతో మహిళల ఉద్యమం. తక్షణ చర్యలకు అధికారుల డిమాండ్.
Bayyaram: బయ్యారంలో మద్యం మహమ్మారిపై సమరం బెల్ట్ షాపులు మూసేయాలని చాటింపు!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో స్థానిక దళితవాడలో సారాయి, మద్యం, బెల్ట్ షాపులను పూర్తిగా బంద్ చేయాలని కోరుతూ మహిళలు, యువకులు, పెద్దలు ఐక్యంగా ఉద్యమించారు. వాడలోని ప్రతి వీధిలో డప్పు చాటింపుతో తిరుగుతూ మద్యం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మద్యం, సారాయి కారణంగా కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు పెరిగి మహిళలు, అనారోగ్యాలతో పిల్లలు పెద్దలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఆఖరికి కుటుంబాలకు దూరమై చిన్నాభిన్నాం అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యువత మద్యానికి బానిస కాకుండా, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా బెల్ట్ షాపులను నియంత్రించాలని కోరారు.
“మా వాడలో సారాయి వద్దు.. బెల్ట్ షాపులు వద్దు మా కుటుంబాల భవిష్యత్తు కావాలి” అంటూ మహిళలు, యువకులు నినదించారు. ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి మద్యం వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
మద్యం విక్రయాలను అరికట్టి, గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




