Kothagudem: సర్వోత్తమ రెడ్డి విజయానికి కృషి చేద్దాం: ఎమ్మెల్యే కూనంనేని
Kothagudem: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి విజయానికి సీపీఐ, కాంగ్రెస్ కలిసి పనిచేయాలని కూనంనేని పిలుపునిచ్చారు.
Kothagudem: సర్వోత్తమ రెడ్డి విజయానికి కృషి చేద్దాం: ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి విజయానికి సిపిఐ, కాంగ్రెస్ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
మంగళవారం కొత్తగూడెంలోని సింగరేణి అతిథి గృహంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ.. నిరుద్యోగులు, విద్యావంతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చట్టసభల్లో బలంగా ప్రశ్నించే గొంతుక అవసరమని అన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థులను ప్రోత్సహించాలని కోరారు.
ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకులను శాసనమండలికి పంపించడమే లక్ష్యంగా పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వినియోగించుకోవాలని సూచించారు. సర్వోత్తమ రెడ్డి విజయానికి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సిపిఐ జిల్లా నాయకులు నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య తదితరులు పాల్గొన్నారు.




