Burgampad: కార్మికుల ఆందోళనలో హింస.. ఒకరికి తీవ్ర గాయం

Burgampad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీ యూనిట్‌లో వేతన ఒప్పందంపై కార్మికుల నిరసన ఉద్రిక్తంగా మారింది.

G Ravi, Bhadradri
Published on: 6 May 2026 9:46 AM IST
Burgampad
X

Burgampad: కార్మికుల ఆందోళనలో హింస.. ఒకరికి తీవ్ర గాయం

బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ITC Limitedకు చెందిన PSPD యూనిట్‌లో 14వ వేతన ఒప్పందంపై కార్మికుల్లో అసంతృప్తి తీవ్రరూపం దాల్చింది. నిన్న అర్ధరాత్రి సమయంలో కార్మికులు వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న వేళ ఉద్రిక్తత చెలరేగింది. ఈ క్రమంలో ఓ కార్మికుడిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సైకిల్ స్టాండ్‌లో ఉన్న ఇనుప పంపుతో దాడి చేయడంతో కార్మికుడికి తలపై గాయం అయింది.

వెంటనే సహచరులు అతడిని చికిత్స కోసం తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వేతన ఒప్పందం పేరుతో కార్మికులపై ఒత్తిడి, విభేదాలు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం, యూనియన్‌ల మధ్య చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో ఉద్రిక్తతలు హింసకు దారితీస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story