Sarapaka: ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం కేటాయించేనా.. పదేళ్లుగా కార్మికుల ఎదురుచూపులు!

Sarapaka: సారపాకలో పూర్తిస్థాయి ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం కేటాయింపు పదేళ్లుగా కలగానే మిగిలింది; ఎమ్మెల్యే హామీ అమలుపై కార్మికుల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

RAVI, BURGAMPAD AREA
Updated on: 14 Nov 2026 12:29 PM IST
Sarapaka
X

Sarapaka: ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం కేటాయించేనా.. పదేళ్లుగా కార్మికుల ఎదురుచూపులు!

Sarapaka: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో పూర్తిస్థాయి ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కలగానే మిగిలింది. సంస్థల నుంచి నెలనెలా లక్షల రూపాయల చందాలు వసూలవుతున్నా కార్మికులకు మాత్రం పూర్తిస్థాయి వైద్యం, అవసరమైన మందులు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గత పదేళ్లుగా ఆసుపత్రి కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు ఎన్నికల ముందు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీ కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఈఎస్ఐ కేంద్రం ఉదయం 11 గంటలకు తెరిచి మధ్యాహ్నం 2:30 గంటలకే మూసివేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది పనితీరును పర్యవేక్షించే అధికారులు కరువయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యే హామీ అమలవుతుందా? రెవెన్యూ శాఖ ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం కేటాయిస్తుందా? కార్మికులకు పూర్తిస్థాయి వైద్యం అందేది ఎప్పుడనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA