wyra: పింఛన్లు పెంచకుండా కాంగ్రెస్ నాటకాలు - లకావత్ గిరిబాబు

wyra: హామీ ఇచ్చినట్లుగా పింఛన్లు పెంచకుండా కొత్త పింఛన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని వైరా బీఆర్ఎస్ నేత లకావత్ గిరిబాబు విమర్శించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 17 Nov 2026 5:24 PM IST
wyra
X

wyra: పింఛన్లు పెంచకుండా కాంగ్రెస్ నాటకాలు - లకావత్ గిరిబాబు

వైరా: ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కొత్త పింఛన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు తదితర వర్గాలకు పింఛన్లు అందించి అండగా నిలిచారని గుర్తుచేశారు.

దివ్యాంగుల పింఛన్ రూ.4 వేల నుంచి రూ.6 వేలకు, ఇతర పింఛన్లు రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

అర్హులైన వృద్ధులు, బీడీ కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. కొత్త పింఛన్ల ప్రకటనలు కాకుండా ముందుగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెంచుతామని చెప్పిన పింఛన్ మొత్తాలను వెంటనే పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయాలని లకావత్ గిరిబాబు డిమాండ్ చేశారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU