Khammam: పిల్లల క్యాన్సర్‌పై తల్లిదండ్రులకు అవగాహన అవసరం: డాక్టర్!
Khammam: చిన్నపిల్లల్లో క్యాన్సర్‌పై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని ఖమ్మంలో యశోద హాస్పిటల్స్ డాక్టర్ పరిణిత రెడ్డి సూచన. 80 శాతం క్యాన్సర్లు నయమవుతాయని వెల్లడి.
Khammam: పిల్లల క్యాన్సర్‌పై తల్లిదండ్రులకు అవగాహన అవసరం: డాక్టర్!
ఖమ్మం: యశోద మెడికల్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత 20 సంవత్సరాలగా చిన్న పిల్లలకు క్యాన్సర్ చికిత్స అందించడంలో అనుభవం కలిగిన యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ డాక్టర్ పరిణిత రెడ్డి గుత్తా ( పీడియాట్రిక్ ఆంకాలజీ & హెమటాలజీ , క్లినిcal డైరెక్టర్ అండ్ హెచ్ ఓ డి )మాట్లాడుతూ పిల్లలకు వచ్చే క్యాన్సర్ మరియు క్యాన్సర్ చికిత్స పై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
చిన్నపిల్లలకు క్యాన్సిల్ అనేది అరుదైన విషయం కాకపోతే దీని గురించి అవగాహన చాలా ముఖ్యం. పూర్తిగా నయం అయ్యే అవకాశాలు చాలా మెరుగుగా ఉంటాయి (దాదాపు 80%) . పుట్టిన నాటి నుండి 18 సంవత్సరాలు వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్ యొక్క చికిత్స విధానాలు , పెద్దవారికి వచ్చే క్యాన్సర్ లకు చాలా తేడా ఉంటుందని అన్నారు.
పిల్లల క్యాన్సర్ చికిత్సలన్నింటిలోనూ శస్త్రచికిత్స , కీమోథెరపీ రేడియేషన్ , టార్గెటెడ్ థెరపీ , ఇమ్యునోథెరపీ మరియు స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ( ఎముక మజ్జ మార్పిడి ) ఉపయోగిస్తారు. మెరుగైన రిజల్ట్ రావడం కోసం చిన్నపిల్లలకి నిర్దేశించబడిన చిన్నపిల్లల డాక్టర్ క్యాన్సర్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చికిత్స జరగాలని తెలిపారు.
పిల్లల్లో నిరంతరం తగ్గని జ్వరం , రక్తస్రావం , కీళ్ల నొప్పులు , రక్తలేమి , కంతలు , తగ్గని వాంతులు , కొత్తగా మెల్లకన్ను రావడం , రాత్రి వేళలో తగ్గని తలనొప్పి వంటివి లక్షణాలు ఉంటే వెంటనే తల్లిదండ్రులు సంబంధించిన డాక్టర్ ను సంప్రదించవలసిందిగా పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెల చిల్డ్రన్స్ ఎవర్నెస్ మంత్ కాబట్టి దీంట్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు . ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ డిప్యూటీ జనరల్ మేనేజర్ అనీష్ కుమార్ తివారి , మేనేజర్లు Mr.బాల కృష్ణ , Mr.సాయి రామ్ పాల్గొన్నారు.




