Yellandu: విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై సబ్ కలెక్టర్‌కు వినతి
Yellandu: ఇల్లందు జేబీఎస్, మర్రిగూడెం పాఠశాలల ఉపాధ్యాయుల వివాదంపై విద్యాశాఖ అధికారుల కాలయాపనపై PDSU నేతలు సబ్ కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు.
Yellandu: విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై సబ్ కలెక్టర్‌కు వినతి
ఇల్లందు: ఇల్లందు పట్టణంలోని జేబిఎస్ పాఠశాల సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండ విచారణల పేరుతో కాలయాపన చేస్తున్నా తీరు, అదేవిధంగా మర్రిగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి ఐదు రోజులకే ఇల్లందు పట్టణంలో పోస్టింగ్ ఇచ్చిన ఈ రెండు సంఘటనలో విద్యాశాఖ అధికారుల కాలయాపన, నిర్లక్ష్య వైఖరులపై, సంఘటన పట్ల సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ల ఆధ్వర్యంలో జిల్లా సబ్ కలెక్టర్ శ్రీ వేణుగోపాల్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా PDSU జిల్లా కార్యదర్శి జె గణేష్, డివిజన్ నాయకులు గంగదార గణేష్ లు మాట్లాడుతూ
ఇల్లందు పట్టణంలోని జే.బి.ఎస్ పాఠశాల నందు హిందీ ఉపాధ్యాయుడు వెంకట్రాములు విద్యార్థినీల పట్ల ఆసభ్యంగా ప్రవర్తించాడు అని విద్యార్థినిలు పాఠశాల ప్రధానోపాధ్యానికి తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనపై ఇల్లందు ఎంఈఓ పాఠశాలను సందర్శించారు. ఆ తర్వాత డీఈవో టేకులపల్లి ఎంఈఓ ని విచారణ అధికారిగా కూడా పంపించారు.
విద్యార్థినీలు జరిగిన విషయాన్ని కులంకశంగా చెబుతున్నప్పటికీ కమిటీల పేరుతో రిపోర్టులు అందలేదని పేరుతో నెల రోజుల నుండి సంఘటన పట్ల కనీస స్పందన లేకుండా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని చూపుతున్నారని కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు.
అదేవిధంగా ఇల్లందు మండలం మర్రిగూడెం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న రమేష్ పాఠశాల విధులకు హాజరు కాకుండా, పాఠశాలలో అవినీతికి పాల్పడ్డాడని ఐదుగురు ఎంఈఓ లతో మూడు సంవత్సరాల పాటు విచారణ జరిపి సస్పెండ్ చేయడం జరిగినది. కానీ తిరిగి ఐదు రోజులకే హఠాత్తుగా ఇల్లందు పట్టణంలో పోస్టింగును ఇచ్చారు. సస్పెండ్ అయిన అధికారి ఐదు రోజులకే తిరిగి పోస్టింగ్ లో ఎలా చేరుతారు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది.
ఈ రెండు సంఘటనలో జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, కాలయాపన గాడి తప్పిన ఉపాధ్యాయులకు చేయూత అందించే విధంగా ఉందని, వెంకట్రాములు పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, మర్రిగూడెం ఉపాధ్యాయుడు రమేష్ సస్పెన్షన్ ఎత్తివేసేందుకు పలువురికి ముడుపులు బాగానే ముటాయనేది, కుల, ధన ప్రభావాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని తీవ్ర ప్రచారం జరుగుతుందని కావున జిల్లా ఉప అధికారిగా ఈ రెండు సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి వెంకట్రాములను విధులు నుండి తొలగించాలని , రమేష్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని బాధ్యతగల అధికారంలో ఉండి నిర్లక్ష్యం, కాలయాపన చేస్తు గాడిదప్పిన ఉపాధ్యాయులకు చేయూతనిచ్చే విధంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కూడా చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.




