Kothagudem: ఇల్లందు బస్టాండ్ వద్ద రైతుల రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అఖిల భారత రైతు-కూలీ సంఘం (AIKMS) ఆధ్వర్యంలో రైతులు భారీ సడక్ బంద్ నిర్వహించారు.

SHOBAN BABU, YELLANDU
Published on: 20 May 2026 5:55 PM IST
Kothagudem
X

Kothagudem: ఇల్లందు బస్టాండ్ వద్ద రైతుల రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్

Kothagudem: రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, దళారీలను వ్యవస్థను కట్టడి చేయాలని, పండించిన ప్రతి పంటకు మద్దతు ధర చెల్లించాలని, కొనుగోలు చేసిన పంటకు వెంటనే రైతుల ఖాతా లో జామ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు-కూలీ సంఘం (ఏఐకెఎమ్ఎస్) ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు సడక్ బంద్ నిర్వహించారు. న్యూడెమోక్రసీ కార్యాలయం నుండి వందలాది మంది రైతులు ప్రదర్శన నిర్వహించి ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో సడక్ బంద్ చేపట్టారు.

ఈసందర్భంగా సిపిఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న అవకతవకలపై గత నెల రోజులుగా రైతాంగం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు.ప్రభుత్వం సకాలంలో వరిధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయకపోవడం వలన కొనుగోలు చేసిన పంటకు డబ్బులు చెల్లించకపోవడం వలన వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తక్షణమే పంటలు కొనుగోలు చేయాలని, దళారీలను అరికట్టాలని,కొనుగోలు చేసిన పంటకు డబ్బులు చెల్లించాలని, తడిసిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని,కళ్ళాల్లో ఉన్న ధాన్యానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్పందించడంతో ఇల్లెందు సిఐ తాటిపాముల సురేష్ జోక్యం చేసుకోని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.ఈ కార్యక్రమం లో

ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు తుపాకుల నాగేశ్వరరావు పొడుగు నరసింహారావు, సూర్ణపాక నాగేశ్వరరావు, పూనెం రంగయ్య, యదళ్ళపల్లి సత్యం, కొక్కు సారంగపాణి, తోడేటి నాగేశ్వరరావు, పర్శిక రవి, మూడు మాలు, మోకాళ్ళ కృష్ణ, జరుపుల కిషన్, భూక్యా మంగ్యా, వాంకుడోత్ మోతిలాల్, కల్తీ కోటమ్మ,నరాటి వెంకన్న, ఎల్. చిన్నస్వామి, గుర్రం యాదగిరి, సామెల్, గొగ్గెల రాజు,చింత నరసింహారావు, తేజావత్ లాలు, గూళ్ల సదయ్య, వాంకుడోత్ శ్రీను, తుడుం శ్రీను, బొమ్మెర్ల వీరన్న తదితరులు పాల్గొన్నారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU

Next Story