Bhadradri: ఇల్లందులో నోటీసులు ఇవ్వకుండా దుకాణాల కూల్చివేత.. ఉద్రిక్తత!

Bhadradri: ఇల్లందులో ముందస్తు నోటీసులు లేకుండా పాత మార్కెట్ దుకాణాలు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వ్యాపారులు, అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు.

SHOBAN BABU, YELLANDU
Published on: 1 Aug 2026 1:53 PM IST
Bhadradri
X

Bhadradri: ఇల్లందులో నోటీసులు ఇవ్వకుండా దుకాణాల కూల్చివేత.. ఉద్రిక్తత!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పాత మార్కెట్ నిర్మాణాల.. కూల్చివేతలపై నిరసన -ఇల్లందులో మునిసిపల్ అధికారుల పై వ్యాపారుల రాజకీయ నాయకుల వాగ్వేదం, ఉద్రిక్తత.

ఇల్లందు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది యంత్రాల సహాయంతో కూల్చివేతల ప్రారంభించడంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయక వారికి పలు రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయల కొందరు చిరు వ్యాపారాలు నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. పేదల బతుకుల తో అధికారులు ఆదుకోవడం సరికాదని హెచ్చరించారు.ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు. కూల్చివేతల సమయంలో చిరు వ్యాపారస్తుల పై దురుసుగా ప్రవర్తించిన మునిసిపల్ అధికారులు పై వివిధ రాజకీయ నాయకులతో వాగ్వేదం దిగారు. అక్కడే బైటయించి ఆందోళన చేశారు.ఈ క్రమం లో పోలీసులు రంగ ప్రవేశం తో అధికారులు కూల్చివేశారు.ఈ ఆందోళన కార్యక్రమం లో అఖిలపక్ష నాయకులు దిండిగల రాజేందర్, నబి,తుపాకుల నాగేశ్వరరావు, బాలగాని గోపి, మావూరి మాధవ్ ఎస్కే జానీ,ఎస్ డి జానీ పాషా తదితరులు ఉన్నారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU

Next Story