Kothagudem: నారా భువనేశ్వరిని కలిసిన బాల పర్యావరణవేత్త విశ్వామిత్ర చౌహాన్!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం పర్యటనలో ఉన్న ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరిని బాల పర్యావరణవేత్త విశ్వామిత్ర చౌహాన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
Kothagudem: నారా భువనేశ్వరిని కలిసిన బాల పర్యావరణవేత్త విశ్వామిత్ర చౌహాన్!
Bhadradri Kothagudem: పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం మొక్కలు నాటుతున్న బాల పర్యావరణవేత్త, వనజీవి విశ్వామిత్ర చౌహాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న భువనేశ్వరిని కలిసిన సందర్భంగా పచ్చదనం, పర్యావరణం కోసం తాను చేస్తున్న సేవలను చౌహాన్ ఆమె దృష్టికి వివరించారు.
ఈ సందర్భంగా సీఎం సతీమణి భువనేశ్వరి చౌహాన్‌ను ఆశీర్వదిస్తూ "నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి. ఇంత చిన్న వయసులో పర్యావరణం పట్ల ఇంత గొప్ప స్పృహ కలిగి ఉండడం నిజంగా గొప్ప విషయం" అని ప్రశంసించారు.
అంతేకాకుండా విశ్వామిత్ర చౌహాన్ వీలు చూసుకుని ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆహ్వానించారు. ఏపీ సీఎంకు చౌహాన్ చేస్తున్న సేవలను వివరిస్తానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో చౌహాన్ చేస్తున్న కృషికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.




