NTR: పి.నైనవరంలో కూటమి అభ్యర్థుల తరపున సినీ నటుడు సుమన్ ఎన్నికల ప్రచారం!
NTR: పి.నైనవరంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బడుగు సామ్రాజ్యం, వార్డు అభ్యర్థి దేవేంద్ర తరపున సినీ నటుడు సుమన్, జనసేన నేత అమ్మిశెట్టి వాసు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
NTR: పి.నైనవరంలో కూటమి అభ్యర్థుల తరపున సినీ నటుడు సుమన్ ఎన్నికల ప్రచారం!
NTR: విజయవాడ రూరల్ మండలం పి.నైనవరంలో కూటమి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బడుగు సామ్రాజ్యం, 1వ వార్డ్ అభ్యర్ధి ధూళిపాళ్ల దేవేంద్ర ఎన్నికల ప్రచారం. ప్రచారంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినీ నటుడు సుమన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు.
సినీ హీరో సుమన్ కి భారీ ర్యాలీతో స్వాగతం పలికిన కూటమి నాయకులు. సర్పంచ్ అభ్యర్థి బడుగు సామ్రాజ్యం, 1వ వార్డు అభ్యర్థి దూళిపాళ్ళ దేవేంద్రతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన సుమన్. సామ్రాజ్యం, దేవేంద్రకు ఓటు వేయాలని అభ్యర్థించిన సుమన్.
ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ
గత 48 సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. దేవేంద్ర కుటుంబంతో 30 ఏళ్లుగా సన్నిహిత సంభంధం ఉంది. తెలుగు అభిమానుల్లో దేవేంద్ర ఒకరు. నెహ్రూ పరిచయం చేశారు. సినిమా హిట్టైనా ప్లాప్ అయినా దేవేంద్ర నాతోనే ఉన్నారు. దేవేంద్ర ఇంటి గృహప్రవేశానికి కూడా నేను వచ్చాను. దేవేంద్ర ఎన్నికల్లో నిలబడుతున్నాను ప్రచారానికి రావాలని కోరారు.
గ్రామంలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు ఏళ్ల తరబడి ఉన్నాయి. దీంతో ప్రజలు అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. గెలిచి ప్రజలకు న్యాయం చేస్తాను అని అన్నారు. ప్రజల గురించి ఆలోచించి నేను ఇక్కడికి రావడం జరిగింది, దేవేంద్ర కుటుంబం నాకు సుపరిచితులు.
బడుగు శ్రీను నిస్వార్ధపరులు గ్రామానికి మంచి చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ప్రజలందరూ గ్రామ అభివృద్ధికి బడుగు సామ్రాజ్యంని,ధూళిపాళ్ల దేవేంద్రని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.
జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ
సర్పంచ్ అభ్యర్థిగా బడుగు సామ్రాజ్యం పోటీ చేస్తున్నారు. నిస్వార్థంగా హీరో సుమన్ వచ్చి ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అభిమానులకు గ్రామంలో మంచి జరగాలని ఉద్దేశంతో సుమన్ రావడం జరిగింది. నేను పుట్టినటువంటి గ్రామంలో బడుగు శ్రీనివాస్ నాకు చిన్ననాటి స్నేహితుడు. గ్రామ అభివృద్ధి కోసం సొంత డబ్బుల ఖర్చు పెట్టే వ్యక్తి బడుగు శ్రీనివాస్.
గ్రామానికి మంచి చేయాలనే ఉద్దేశంతో శ్రీనివాస అభ్యర్థిగా పోటీ చేశారు. గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామం అభివృద్ధికి నోచుకోకుండా ఇలాగే ఉండిపోయింది. కూటమి నాయకులు గ్రామ అభివృద్ధికి నడుము కట్టి ముందుకు వచ్చారు.
గ్రామ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి తమ అమూల్యమైన ఓటును కూటమి అభ్యర్థి గుర్తులు పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను.




