Penamaluru: పోరంకిలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు!
Penamaluru: పోరంకిలో అనుమోలు ఆదరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఉచిత మందుల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరై అభినందించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్.
Penamaluru: పోరంకిలో ఉచిత వైద్య శిబిరం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు!
Penamaluru: అనుమోలు ఆదరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులు అభినందనీయమని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యుల శ్రీ బోడే ప్రసాద్ గారు అన్నారు.
ఈ సందర్భంగా క్యాంపులో పాల్గొన్న పేదలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన బీపీ,షుగర్,కంటి పరీక్షలు,గుండె సంబంధిత పరీక్షలు తదితర వైద్య సేవలు అందించారు,వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులను నెలకు సరిపడా ఉచితంగా పంపిణీ చేశారు.
పేద కుటుంబాలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో నెలనెలా మందుల కోసం అయ్యే ఖర్చు భారంగా మారుతుందని,అలాంటి వారికి ఈ సేవా కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు.
ప్రతి నెలా ఉచితంగా మందులు అందించడం ద్వారా పేదలకు వేలాది రూపాయల ఆర్థిక భారం తగ్గడంతో పాటు,ఆరోగ్యపరమైన భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అనుమోలు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ ప్రభాకరరావు గారిని ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆరోగ్యం.. ప్రజల సంక్షేమం.. సేవే లక్ష్యంగా ముందడుగు.




