Vuyyuru: ఏపీడబ్ల్యూజేఎఫ్ పెనమలూరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Vuyyuru: ఉయ్యూరు విజ్ఞాన కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ పెనమలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. గౌరవాధ్యక్షుడిగా పిల్లి గోపాల స్వామి, అధ్యక్షుడిగా అజయ్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక.

Ramana, Penamaluru
Published on: 31 Aug 2026 12:18 PM IST
Vuyyuru
X

Vuyyuru: ఏపీడబ్ల్యూజేఎఫ్ పెనమలూరు నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Vuyyuru: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజెఎఫ్) పెనమలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఉయ్యూరులోని నాగళ్ల రాజేశ్వరమ్మ - జానకి రామయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంఘం అభివృద్ధి, పాత్రికేయుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. గౌరవాధ్యక్షులుగా పిల్లి గోపాల స్వామి,

అధ్యక్షులుగా దేవరపల్లి అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా కొప్పుల బాల కిషోర్, ఉపాధ్యక్షులుగా ఎం. అజయ్, శివ ప్రసాద్, సహ కార్యదర్శులు గా బి. రాజు, శివ కుమార్, ట్రెజరర్ తూమాటి సుధాకర్, కార్యవర్గ సభ్యులుగా బి. మురళీకృష్ణ, చలసాని సురేష్, ప్రసాద్, కృష్ణ, కోటేశ్వరరావు లు నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు పలువురు సభ్యులు, జర్నలిస్టు మిత్రులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story