Tiruvuru: తిరువూరులో ఆశా వర్కర్ల ఆందోళన..ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన!

Tiruvuru: కనీస వేతనాలు, సెలవులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా.

Venkateswara Rao, Tiruvuru
Published on: 6 Oct 2026 1:11 PM IST
Tiruvuru
X

Tiruvuru: తిరువూరులో ఆశా వర్కర్ల ఆందోళన..ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన!

Tiruvuru: తిరువూరులో CITU ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల నిరసన. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ఆందోళన. కనీస వేతనాలు చెల్లించి ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్. అన్ని రకాల సెలవులు అమలు చేయాలని కోరిన ఆశా వర్కర్లు. వారాంతపు సెలవులు, నేషనల్ హాలిడేస్, పండుగ సెలవులు కల్పించాలని డిమాండ్. దహన సంస్కారాల భత్యాలు ఇవ్వాలని కోరిన ఆశా వర్కర్లు. ఆశా వర్కర్ల నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని డిమాండ్.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి. పీహెచ్‌సీలకు వెళ్లిన ప్రతిసారీ టీ, డీఏలు ఇవ్వాలని డిమాండ్. ఎన్‌హెచ్‌ఎం, ఓహెచ్‌ఎం శిక్షణ పొందిన ఆశాలకు పర్మినెంట్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన వర్కర్లు. ఆశా వర్కర్లకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్.

నాణ్యమైన మొబైల్ ఫోన్లు, యూనిఫారాలు ఇవ్వాలని కోరిన ఆశా వర్కర్లు. గ్రాట్యూటీకి సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్.

కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్చాలని కోరిన వర్కర్లు. సమాన పనికి సమాన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్.

Venkateswara Rao, Tiruvuru

Venkateswara Rao, Tiruvuru