Penamaluru: పోరంకిలో రూ 9 30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్వోసీ పత్రాల పంపిణీ!
Penamaluru: పోరంకిలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లబ్ధిదారులకు రూ.9.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్వోసీ పత్రాలను అందజేశారు. పేదలకు కూటమి ప్రభుత్వమే అండన్నారు.
Penamaluru: పోరంకిలో రూ 9 30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్వోసీ పత్రాల పంపిణీ!
Penamaluru: పోరంకి ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.9.30 లక్షల విలువైన LOC పత్రాలను ఏడుగురు లబ్ధిదారులకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు,పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారు,ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ.
పేద కుటుంబంలో అనారోగ్యం కారణంగా డబ్బులు లేక చికిత్స ఆగిపోకూడదు,ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం,CMRF ద్వారా అవసరమైన వారికి వేగంగా సహాయం అందిస్తూ,కష్టకాలంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం,ప్రజల ప్రాణాలు,ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ వెనక్కి తగ్గదు అని తెలిపారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన వైసీపీ పాలనకు భిన్నంగా. కూటమి ప్రభుత్వం పేదల కష్టం వింటోంది. కన్నీరు తుడుస్తోంది. ఆపదలో అండగా నిలుస్తోంది.కష్టాల్లో ఉన్న కుటుంబానికి భరోసా.పేదల ఆరోగ్యానికి రక్షణ.ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం.
ప్రజల పక్షాన నిరంతరం అందుబాటులో ఉంటూ,ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు మరోసారి తన సేవా నిబద్ధతను చాటుకున్నారు.




