Penamaluru: పెనమలూరులో 11 మందికి రూ. 13.22 లక్షల CMRF LOCలు అందజేత!
Penamaluru: పెనమలూరు నియోజకవర్గంలో 11 మంది లబ్ధిదారులకు రూ. 13,22,000 విలువైన CMRF LOC పత్రాలను టీడీపీ యువ నాయకుడు బోడే వెంకట్రామ్ అందజేశారు.
Penamaluru: పెనమలూరులో 11 మందికి రూ. 13.22 లక్షల CMRF LOCలు అందజేత!
Penamaluru: పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ఆదేశాల మేరకు,నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.13,22,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) LOC పత్రాలను పెనమలూరు నియోజకవర్గ యువ నాయకులు శ్రీ బోడే వెంకట్రామ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చింది,ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ,ప్రతి కుటుంబానికి అండగా నిలిచి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి ప్రజాసేవా దృక్పథాన్ని లబ్ధిదారులు,స్థానికులు కొనియాడారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రజల కోసం ప్రభుత్వం అనే నినాదాన్ని ఆచరణలో నిలబెడుతోంది,ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.




