Nandigama: ఆపన్నులకు సీఎంఆర్ఎఫ్ పెద్ద భరోసా: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

Nandigama: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చందర్లపాడు మండలానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు ₹29.63 లక్షల సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను అందజేశారు.

Naresh, Nandigama
Published on: 2 Oct 2026 3:26 PM IST
Nandigama
X

Nandigama: ఆపన్నులకు సీఎంఆర్ఎఫ్ పెద్ద భరోసా: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ: పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు.

నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం కూటమి నేతలతో కలిసి చందర్లపాడు మండలానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు రూ.29,63,012 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నేరుగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ...

అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో భరోసానిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందని తెలిపారు.

ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మరింత మంది బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు,కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Naresh, Nandigama

Naresh, Nandigama