Kankipadu: కంకిపాడు జడ్పీటీసీగా దండమూడి పూజిత ఘన విజయం

Kankipadu: కంకిపాడు జడ్పీటీసీగా కూటమి అభ్యర్థిని దండమూడి పూజిత 8,392 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రజలకు, శ్రేణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Ramana, Penamaluru
Published on: 8 Nov 2026 3:28 PM IST
Kankipadu
X

Kankipadu: కంకిపాడు జడ్పీటీసీగా దండమూడి పూజిత ఘన విజయం

కంకిపాడు: కంకిపాడు మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థినిగా పోటీ చేసి 8,392 ఓట్ల భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించిన దండమూడి పూజిత మండల ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా తనపై నమ్మకంతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అహర్నిశలు శ్రమించిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి శ్రేణుల కృషి ఈ విజయానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ప్రజలు తనపై చూపించిన ఆదరాభిమానాలు, ప్రోత్సాహం, అపూర్వమైన మద్దతును జీవితాంతం మరువలేనని పూజిత తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని తనకు అందించిన ప్రజలందరికీ అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కంకిపాడు మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజాసేవకు నిరంతరం కృషి చేస్తానని దండమూడి పూజిత హామీ ఇచ్చారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru