Indrakeeladri: ఇంద్రకీలాద్రి దసరా: సామాన్య భక్తులకే పెద్దపీట – ఈవో శీనా నాయక్

Indrakeeladri: ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాల్లో సామాన్య భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిబంధనలను అందరూ పాటించాలని ఆలయ ఈవో వీకే శీనా నాయక్ స్పష్టం చేశారు.

Satyanarayana, Vijayawada
Published on: 22 Sept 2026 9:01 PM IST
Indrakeeladri
X

Indrakeeladri: ఇంద్రకీలాద్రి దసరా: సామాన్య భక్తులకే పెద్దపీట – ఈవో శీనా నాయక్

​ఇంద్రకీలాద్రి: రానున్న శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని నిన్న కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న కీలక నిర్ణయాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ మంగళవారం సాయంత్రం మహా మండపం సమావేశ మందిరంలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు మరియు ఆలయ సిబ్బందికి సమగ్రంగా వివరించారు.

​ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ.. కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ, మునిసిపల్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏఐ సాంకేతికతతో క్యూలైన్ల నిర్వహణ, భద్రత, స్మార్ట్ లడ్డూ వెండింగ్ మిషన్లు, ట్రాఫిక్ నియంత్రణ మరియు పార్కింగ్ అంశాలపై కార్యాచరణ సిద్ధమైందని పేర్కొన్నారు.

​దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రికి తరలివచ్చే లక్షలాది మంది సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్, దేవాదాయ మరియు నగర పాలక సంస్థలు సమన్వయంతో తీసుకునే నిర్ణయాలు, మార్గదర్శకాలను ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ విధిగా పాటించి సహకరించాలని ఈవో స్పష్టం చేశారు.

ప్రోటోకాల్ దర్శనాల విషయంలో నిబంధనలు పాటిస్తూ, సాధారణ భక్తుల దర్శనానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని, ఏదైనా సందర్బం వస్తే వంద మంది లేదా రెండు వందల మంది సౌకర్యం కోసం లక్షలాది మందిని ఇబ్బంది పెట్టలేమని, దేవస్థానంకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఇంద్రకీలాద్రి కి వచ్చే భక్తుల సేవలో అంతా సహకరిస్తామని ఈ సందర్బంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బంది పేర్కొన్నారు.

ఈ సమావేశంలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada